నేటి నుంచి ఈ-ఆఫీస్ సేవలు

1 Jun, 2016 03:20 IST|Sakshi
నేటి నుంచి ఈ-ఆఫీస్ సేవలు

గుంటూరు జిల్లాలో మరో నెల ఆలస్యం
గుంటూరు ఈస్ట్: జిల్లాలోని పది శాఖల్లో ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్లు వారు చెబుతున్నారు.  ఎలా పని చేస్తుంది అన్ని కార్యాలయాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులన్నీ స్కానింగ్ చేసి కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తారు. వీటిని సంబంధిత అధికారికి పంపుతారు. ఈ దరఖాస్తు కొన్ని సెకన్లకే సంబంధిత అధికారి ముందుకు వెళుతుంది. అన్ని స్థాయిల్లో ఫైలు ఎవరు ఆలస్యం చేస్తున్నారో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టీఏ యాక్ట్ తదితర అదనపు పనులు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశల్లో ఉందో ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల అధికారులు తెలుసుకోవచ్చు.
 
జిల్లాలో ఎప్పటి నుంచి..
జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించాలని తొలుత జిల్లా అధికారులు భావించారు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఇతర సాంకేతిక కారణాలతో మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది.

డీఆర్వో నాగబాబు, ఈ ఆఫీస్ జిల్లా కో-ఆర్డి నేటర్
ఇప్పటికే రెవెన్యూలో ఈ ఆఫీస్ ప్రారంభమైంది. దీంతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. కొద్ది రోజుల్లో అన్ని ఆటంకాలు అధిగమించి 10 శాఖల్లో ఈ ఆఫీస్ ప్రారంభిస్తాం. ఈ విధానంలో ఏవైనా లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.

మరిన్ని వార్తలు