శాంతియుతంగా నిరసనలు చేపట్టండి

6 Jan, 2015 02:02 IST|Sakshi
శాంతియుతంగా నిరసనలు చేపట్టండి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి
 
నెల్లూరు (సెంట్రల్): విద్యార్థుల సమస్యల పరిష్కారానికి శాంతియుతంగానే నిరసనలు చేపట్టాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరుసీటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆమోదంతో జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సుమారు 200 మంది విద్యార్థులు వైఎస్సార్ విద్యార్థి విభాగంలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో విద్యార్థులు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ఉద్యమాలు చేపట్టే సమయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటిం చాలన్నారు. విద్యార్థులు పార్టీకి ఎంతో అవసరమన్నారు. పార్టీలో చేరినవారికి విద్యార్థి విభాగంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాలోకంటే నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అన్నిం టిలోనూ ముందుందని కొనియాడారు.

విద్యార్థులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతామని ముం దుకు రావడం సంతోషకరమన్నారు. విద్యార్థుల న్యాయమైన సమస్యల పరి ష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు హరికుమార్, వైఎస్సా ర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, నగర అధ్యక్షుడు విశ్వరూపాచారి, రాష్ట్ర ఉప కార్యదర్శి హాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు మదన్‌కుమార్‌రెడ్డి, హరికృష్ణ, సత్య, విద్యార్థి నాయకు లు వి.సురేష్, అవినాష్‌రెడ్డి, మన్సూర్, తేజ, ఆసిఫ్, కల్యాణ్ పాల్గొన్నారు.

వైఎస్సార్ టీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ  
వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన నివాసంలో సోమవారం అవిష్కరించారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె.వాసు, ప్రధాన కార్యదర్శి బి.రఘురామిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు కేవీ రమణారెడ్డి, కోవూరు మండల ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతి వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు