జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

22 Jun, 2019 07:45 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా భూగర్భ గనుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యేగా చాలాకాలం పని చేశారు. 2009లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రివర్గంలో పని చేశారు. అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వైఎస్‌ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నుంచి విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడు. ఈయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఐదేళ్లుగా అనంతపురం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.  

మరిన్ని వార్తలు