పంచాయతీరాజ్‌ చట్టంలో కీలక సవరణలు: మంత్రి

17 Jun, 2020 18:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే కీలక సవరణలు చేశామని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు 14 రోజుల లోపు,  ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు 10 రోజులు లోపు నిర్వహించాలని సవరణలు చేశామని వెల్లడించారు. గ్రామ సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండాలని, దీనివల్ల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టొచ్చునని అన్నారు. 

చట్ట సవరణలను ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం వెల్లడించారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్నా, పంచాయతీ ఆడిట్ సకాలంలో నిర్వహించక పోయినా బాధ్యులను తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్‌ తెగల ప్రాంతాల్లో అన్ని సీట్లు ఎస్టీలకే రిజర్వేషన్లు చేస్తూ చట్ట సవరణలు తీసుకు వచ్చామని తెలిపారు.

నల్ల చొక్కాలు వేసుకుని సభకు రాలేదు
వార్షిక బడ్జెట్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 200 కోట్లు కేటాయించడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల తరుపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై‌ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుటామని అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని, నలుపు చొక్కాలు వేసుకొని సభకు రాకుండావెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు