పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి

24 Dec, 2019 14:51 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ప్రారంభించారు. వనరత్నాల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ప్రవాస భారతీయుడు, పూర్వ విద్యార్థి భీమవరపు సోమశేఖర్‌ రెడ్డి రూ. కోటీతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు.

అదే విధంగా పాఠశాల ఫర్నీచర్‌కు పది లక్షలు విరాళం అందించారు. ఈ స్కూల్‌ భవనం నాడు-నేడు కార్యక్రమంలో పూర్తి అయింది. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని భాలశౌరి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు