నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి

5 Sep, 2019 12:53 IST|Sakshi

సాక్షి, కృష్ణా: నందిగామలో చెవిటికల్లు ప్రాంతంలో ఇసుకరీచ్‌, ఇసుక నిల్వ అమ్మక కేంద్రాన్ని పంచాయతీ రాజ్‌, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియాకు కళ్లెం వేసేలా నూతన ఇసుక విధానం తీసుకువచ్చామన్నారు. వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్టాక్‌ యార్డ్‌లో లోడింగ్‌తో కలిపి టన్ను ఇసుక రూ.375 గా నిర్ణయించామన్నారు. 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్టోబర్‌ నాటికి 70 నుంచి 80 వరకు స్టాక్‌ పాయింట్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్‌, ఏపీ ఎండీసీ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు