ఏపీ: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు

1 Feb, 2020 17:56 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు 72.54 శాతం పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీతో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. 39 లక్షల 66 వేల మందికి ఒక్కపూటలో గ్రామ వాలంటీర్లు పించన్లు అందజేశారని ఆయన చెప్పారు.

ఇందులో భాగంగా అత్యధికంగా కడప జిల్లాలో 84.43 శాతం, నెల్లూరులో 83.18 శాతం పింఛన్లను పంపిణీ చేశారని పెద్దిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటింటికి పింఛన్లు అందజేశామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేశారు. పింఛన్ల కోసం ఫిబ్రవరి నెల రూ. 1,320 కోట్లు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. ఇంటింటికి పింఛన్లను డోర్‌ డెలివరీ చేయడం దేశంలో ఎక్కడా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. (రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్‌' ప్రారంభం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు