‘ఉపాధి హామీ కూలీల వేలనాలు విడుదల చేయండి’

27 Mar, 2020 18:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధి హామీ కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలని  కోరుతూ  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన వేజ్ కాంపోనెంట్ బకాయిలు రూ. 382.85 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. (కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ)

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ వరకు వున్న ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా  ప్రధాని  నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు 21 రోజుల పాటు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని తెలిపారు. కాగా ఈ పరిస్థితుల్లో వీరికి చెల్లించాల్సిన వేజ్ కాంపోనెంట్ నిధులను తక్షణం విడుదల చేసి ఈ కష్ట సమయంలో వారికి ఆర్థికంగా చేయూతను అందించాలని కోరారు. అలాగే లాక్ డౌన్ సమయంలో ఉపాధి పనులపైనే ఆధారపడిన కూలీల పరిస్థితిపై కూడా కేంద్రం చర్యలు తీసుకుని, వారికి న్యాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. (‘అవి కూడా లాక్‌డౌన్‌ చేయాలి’)

మరిన్ని వార్తలు