అభివృద్ధి కాంతులు

16 Oct, 2013 04:01 IST|Sakshi

గద్వాల, న్యూస్‌లైన్: నడిగడ్డ గద్వాల ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. ఇక ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాలకు సమీపం లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. వీటికితో డు జూరాల ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తి కేం ద్రం, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల ని ర్మాణం జరిగింది. గద్వాల డివిజన్‌లోనే జూరాల,నెట్టెంపాడు, ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టులతో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 
 సాగునీరు సౌకర్యం పుష్కలంగా ఉన్న గద్వాల ప్రాంతంలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో రూ.110 కోట్లతో నిర్మించిన భారీ తాగునీటి పథకం త్వరలోనే మొదటిదశలో 31 గ్రామాలకు నీరు అందనుంది. ఇలా తాగు, సాగునీటి వనరులతో పాడి పరిశ్రమలో ముందడుగు వేసే పరిస్థితులు ఉండటంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గద్వాలలో ఇటీవల కొత్త దాణా ఫ్యాక్టరీకి శంకుస్థాపనచేశారు. ఇక్కడ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుంది. వీటికితోడు గద్వాల ప్రాంత అభివృద్ధికి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రతిపాదనలో ఉన్న గద్వాల- రాయిచూర్ నూతన బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ ఇటీవల పూర్తయి ప్రారంభమైంది.
 
 మరిన్ని అభివృద్ధి పనులు
 ఇలా ప్రాజెక్టులు ఒకటి తర్వాత మరొకటి అం దుబాటులోకి వస్తుండటంతో, గద్వాల ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం రింగ్‌రోడ్డు ప నులు టెండర్ల దశలోనే ఉన్నాయి. త్వరలోనే ఈ రింగ్‌రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. గ ద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యగా మారిన మొదటి రైల్వేగేటు వద్ద రూ.41కోట్ల అంచనావ్యయంతో ఆర్‌ఓబీ నిర్మాణానికి ఇటీవల టెం డర్లు పిలిచారు.
 
 ఇలా గద్వాల ప్రాంత అభివృద్ధి మరో ముందడుగుపడేలా రింగ్‌రోడ్డు, ఆర్‌ఓ బీల టెండర్లు ప్రారంభమయ్యాయి. దీనికితో డు గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా(44వ జా తీయ రహదారి వరకు), గద్వాల నుంచి వయా మల్దకల్, అయిజ మీదుగా నాగల్‌దిన్నె వరకు రోడ్డును స్టేట్ హైవేగా గుర్తిస్తూ ప్రభుత్వం కొద్దినెలల క్రితం జీఓ జారీచేసింది. అలంపూర్ ని యోజకవర్గంలో కీలకమైన అలంపూర్ చౌరస్తా నుంచి బల్గెర వరకు ఉన్న రోడ్డును కూడా స్టేట్‌హైవేగా గుర్తించారు.

ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ప్రగతికి మరింత దోహదపడుతుంది. నెట్టెం పాడు నుంచి అనుబంధంగా గట్టు మండలంలోనిపై ప్రాంతానికి సాగునీటిని అందించేలా గ ట్టు లిఫ్టుకు అనుమతి కోసం ఇప్పటికే సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఇది మంజూరైతే ఇక కరువు ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్డీఎస్‌లో సాగునీరందని ప్రాంతానికి తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా సాగునీటిని అం దించేందుకు సర్వే నిర్వహించారు. ఈ పథకానికి కూడా మంజూరు లభిస్తే నడిగడ్డ అంతటా సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తుంది.
 

మరిన్ని వార్తలు