ప్రాదేశిక పోరులో ఫ్యాను జోరు

6 Apr, 2014 05:27 IST|Sakshi
ప్రాదేశిక పోరులో ఫ్యాను జోరు
  •      ప్రచారంలో వైఎస్సార్‌సీపీ ముందంజ
  •      ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీవైపే మొగ్గు
  •      టీడీపీకి రెబల్స్ బెడద
  •      ముమ్మరంగా తమ్ముళ్ల తాయిలాల పంపిణీ
  •      నేడు మదనపల్లె డివిజన్‌లో తొలివిడత పోలింగ్
  •      445 ఎంపీటీసీలు, 31 జెడ్పీటీసీలకు ఎన్నికలు
  •  సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో వైఎస్సార్‌సీపీ ముందంజలో నిలి చింది. తొలివిడతగా మదనపల్లె డివి జన్‌లో 31 మండలాల్లో  ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి.  31 జెడ్పీటీసీ, 445 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చాలా ప్రాంతాల్లో రెబల్స్ బెడద ఉండ గా, కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రంగా ఉంది.
     
    పుంగనూరు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైఎస్సాఆర్‌సీపీ శ్రేణులు చురుగ్గా పనిచేశాయి. అన్ని పంచాయతీల్లోని ఓటర్లను అభ్యర్థులు నేరుగా కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు.

    వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలు మళ్లీ అమలుకు నోచుకోవాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాలని వా రు కోరారు. మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరు నియోజకవర్గంలో పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డిని కలుపుకుని ప్రచారం చేశారు.

    మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉన్న క్యాడర్ మొత్తం వైఎస్సాఆర్‌సీపీ వైపు రావడంతో పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో  వైఎస్‌ఆర్‌సీపీ పుంజుకుంది. దీనికితోడు మైనారిటీ ఓటు బ్యాంకు వైస్సార్‌సీపీ వైపే ఉంది. తంబళ్లపల్లెలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి ఆపార్టీ అభ్యర్థులకే జర్కిచ్చారు.  అన్ని మండలాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థులను నిలిపారు.  

    అదే సమయంలో తంబళ్లపల్లె నియోజకవర్గ వైఎస్సాఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రామస్థాయిలో నాయకులను, కార్యకర్తలను కలుపుకుని అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీ మూడుగ్రూప్‌లుగా మారడం  వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తోంది. కుప్పం నియోజకవర్గంలో సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి, మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి సంయుక్తంగా ప్రచారం చేశారు.  
     
    టీడీపీకి రెబల్స్ బెడద

     
    మొదటి విడత స్థానిక పోరులో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో రెబెల్స్ తలనొప్పి ఎక్కువగా ఉంది. పుంగనూరులో టీడీపీ లోని రెండు గ్రూపులు తాము సూచించినవారికి టికె ట్టు ఇవ్వని చోట అధికారిక టీడీపీ అభ్యర్థి విజయానికి గండికొట్టి, తిరుగుబాటు తమ్ముళ్లను ప్రొత్సిహ ంచారు. స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన తిరుగుబాటు తమ్ముళ్లకే ఓట్లు వేయాల్సిందిగా ప్రచారం చేశారు.
     
    విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ
     
    గెలుపుపై అశలు లేకపోవడంతో  తెలుగుతమ్ముళ్లు చాలా చోట్ల మద్యం, డబ్బులు, కానుకల పంపిణీకి తెరలేపారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓట్లు సరిగ్గా రావనుకున్న పంచాయతీల్లో ముక్కుపుడకలు, చీరలు, నగదును తెలుగుతమ్ముళ్లు విచ్చలవిడిగా పంచారు.
     

మరిన్ని వార్తలు