వయోవృద్ధులకు పెన్షన్‌ వెసులబాటు

22 Mar, 2018 13:32 IST|Sakshi

విజయనగరం రూరల్‌ : వయోవృద్ధులైన పింఛన్‌దారులు బయోమెట్రిక్‌ వేసేందుకు ఇక నుంచి ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా ప్రభుత్వం వెసులుబా టు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వినియోగదారులు సేవా కేంద్రం ఇన్‌చార్జి చదలవాడ ప్రసాదరావు పే ర్కొన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న వినియోగదారుల సేవా కేంద్రంలో వయోవృద్ధులతో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరా లు నిండిన వయోవృద్ధులు సబ్‌ట్రెజరీ అధికారికి పింఛన్‌ వెసులుబాటుకు దరఖాస్తు చేసుకుంటే సహాయకులను ఇంటి వద్దకే పంపించి వేలిముద్రలు తీసుకుంటారని చె ప్పారు. వేలిముద్రలు పడని వారు జీవించే ఉన్నామన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపా రు. ఈ పత్రాన్ని సహా యకులు ఇంటి వద్దకు వచ్చి తీసుకుంటారన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ యోవృద్ధులు వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స భ్యులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు