ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తాం: మృణాళిని

22 Jul, 2014 15:03 IST|Sakshi
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తాం: మృణాళిని
హైదరాబాద్: కొత్త పెన్షన్ విధానాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మృణాళిని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతనంగా అమలు చేసే విధానం వల్ల 43 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి మృణాళిని తెలిపారు. కొత్త పెన్షన్ విధానాన్ని ఆధార్‌ను లింక్ చేస్తున్నామని ఆమె అన్నారు. 
 
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. ఆగస్టు 30 లోగా పెన్షన్‌దారులకు ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ల కోసం 3788 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, 9 లక్షల పెన్షన్లను కేంద్రం మంజూరు చేస్తుందని మంత్రి మృణాళిని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. 
 
అలాగే డ్వాక్రా రుణమాఫీకి 7640 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని, రిజిస్టర్ అయన ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు లక్ష రూపాయల మాఫీ వర్తిస్తుందన్నారు. డిఫాల్టర్ల గ్రూప్‌లకు కూడా రుణమాఫీ వర్తింపు చేస్తామని మరో ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. 
మరిన్ని వార్తలు