బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా? 

25 Oct, 2019 04:01 IST|Sakshi
బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకున్న గలిబిపల్లి ప్రజలు

ఎమ్మెల్యే బాలకృష్ణ కారును అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన గలిబిపల్లి గ్రామస్తులు

భూమి పూజ చేసి మూడేళ్లయినా రోడ్డెందుకు వేయించలేదంటూ ఆగ్రహం 

హిందూపురం/లేపాక్షి: ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆయన కారును అడ్డుకున్నారు. భూమి పూజ చేసి మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేదంటూ బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. హిందూపురం–చిలమత్తూరు మెయిన్‌రోడ్‌ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్‌ వేయడానికి మూడేళ్ల కిందట భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్‌ వేస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మెయిన్‌ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు.

మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయావో చెప్పాలంటూ నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు. ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్‌ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని చెప్పినా.. గ్రామస్తులు వెనక్కితగ్గలేదు. విధిలేని పరిస్థితిలో వారిని తప్పించుకుంటూ బాలకృష్ణ కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

యోధురాలి నిష్క్రమణం

నన్నయ శ్లోకాలు!

అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్‌బౌన్స్‌ కేసులు

హామీల తక్షణ అమలుకై ఏపీ సర్కారు ప్రత్యేక జీవో

వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ

ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..!

స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు

ధనత్రయోదశి ధగధగలు

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

తిరుమలలో సందడి చేసిన నయనతార

సారుకు సగం.. బార్లకు సగం..! 

‘రికార్డుల’ గిత్త ఆకస్మిక మృతి

ప్రియుడి కోసం బాలిక హంగామా

ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో టెండర్లు

చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే

అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి

ఉత్తరాంధ్రను ముంచెత్తిన భారీ వర్షాలు

కృష్ణమ్మ ఉగ్రరూపం

పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు

డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు

పెట్రో కెమికల్‌ కారిడార్‌తో భారీ పెట్టుబడులు

ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?

చేనేతలకు కొండంత అండ

యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌