దొంగ ఎవరో ప్రజలకు తెలుసు

8 Mar, 2019 14:50 IST|Sakshi
మాట్లాడుతున్న నాగార్జునరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి     నాగార్జునరెడ్డి

బద్వేలు: వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు, ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడంలో టీడీపీదే ప్రధాన పాత్ర అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, పోరుమామిళ్ల జెడ్పీటీసీ శారదమ్మ పేర్కొన్నారు. గురువారం  కవలకుంట్ల పంచాయతీ పరిధిలోని బూత్‌ నంబర్లు 44, 45, 46 కన్వీనర్లు, సభ్యులతో సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నాగార్జునరెడ్డి సూచించారు.  రాష్ట్రంలో చంద్రబాబు అబద్ధాలతో పాలన చేస్తున్నారని, ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఓట్లు తొలగించి గెలుపొందేందుకు తప్పుడు మార్గాల్లో టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో దొంగలెవ్వరో ప్రజలందరికీ తెలసని అన్నారు. నిష్పాక్షపాతంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లు సైతం తమ పేరు ఓటరుజాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ ప్రభాకరరావు, పీరయ్య, సుబ్బరాయుడు, ఏసురత్నం, రామయ్య, బాబు, సుబ్బానాయుడు, తిరుపతయ్య, మద్దయ్య, శేషయ్య, వెంకటరమణ, రమణయ్య నారాయణ, పిచ్చయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు