ఉలికిపాటు

8 May, 2020 13:14 IST|Sakshi
నగరం ఘటనలో భస్మీపటలమైన కొబ్బరి తోట (ఫైల్‌ ఫొటో)

ఫుడ్‌ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై నిఘా అవసరం

‘నగరం’ ఘటనలో పరిహారాన్ని పరిహాసం చేసిన ‘బాబు’

విశాఖ ఘటనలో రికార్డు స్థాయిలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం

అన్ని వర్గాల నుంచి ప్రశంసలు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటనతో జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. విశాఖ స్థాయిలో రసాయన పరిశ్రమలు ఇక్కడ లేకున్నా అమ్మోనియా గ్యాస్, కెమికల్స్‌ ఆధారంగా నడిచే పరిశ్రమలు లేక పోలేదు. విశాఖ ప్రమాదం తరువాత జిల్లాలో ఉన్న పరిశ్రమలు, వాటిలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా ఎంత వరకూ ఉందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జిల్లాలో పలు ఫ్యాక్టరీ లు, అతి భారీ పరిశ్రమల కోటాలో ఉన్న ఓఎన్‌జీసీ గ్యాస్, చమురు అన్వేషణ, రవాణా సందర్భాల్లో సంభవించిన గత దుర్ఘటనలను జిల్లా ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ ప్లాంట్లు రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎరువులు, మందులు తయారీ ఫ్యాక్టరీలలో అమ్మోనియా, కార్బన్‌ మోనాక్సైడ్‌ గ్యాస్‌తో నిర్వహిస్తున్న కర్మాగారాలలో వాటి వినియోగంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని విశాఖ ఘటన గుర్తు చేస్తోంది.

జిల్లాలో ఘటనలు ఇలా...
అమ్మోనియా, కార్బన్‌ మోనాక్సైడ్‌ లీకేజీలతో ప్రజలు ప్రాణాలతో చెలగాట మాడిన సంఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి.
కాకినాడ సూర్యారావుపేటలో కేడియా ఆయిల్‌ రిఫైనరీలో 2004లో అమ్మోనియా గ్యాస్‌ సిలెండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనమైంది. నాటి ప్రమాదంలో మృతి చెందినది ఒకరే అయినా పది మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు.
2016 అక్టోబర్‌లో పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం శివారున నెక్కంటి సీ ఫుడ్‌ ఫ్యాక్టరీలో రెండు రోజులు వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 50 మందికిపైనే కార్మికులు అస్వస్థ తతో ఆస్పత్రిపాలయ్యా రు. అక్టోబరు 25, 26 తేదీలలో రెండుసార్లు కార్బన్‌ మోనా
క్సైడ్‌ లీకై పెను ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌లీక్‌ ఘటనలో మాదిరిగానే మహిళలు ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడి వాతావరణం ఆర్తనాదాలతో నిండిపోవడం గమనార్హం.  
రంగంపేట మండలం దొంతమూరు–బాలవరం మధ్య ఎరువుల ఫ్యాక్టరీ, గ్యాస్ట్రిక్‌ సోడా కంపెనీల ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకట్ట వేశారు.
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో గత ఏడాది రైస్‌మిల్లులోని టర్బయిన్‌ పేలిపోయి పెను ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవన్నీ చమురు, సహజవాయువు సంస్థలు నిర్వహించే అన్వేషణతో సంభవించిన ప్రమాదాలు. దాదాపు ఈ ప్రమాదాలన్నింటిలోను ఆయా అన్వేషణా సంస్థల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం ఆనక గాలికొదిలేయడం రివాజుగానే మారింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయడం విషయం మరుగునపడిపోయాక ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకోవడం పరిపాటిగా మారింది.  
ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌లో యానాంకు సమీపాన గాడిమొగ, కోనసీమలోని నగరం, ఎస్‌.యానాం, కేశనపల్లి తదితర ప్రాంతాల్లో  చమురు, సహజ వాయువు అన్వేషణ జరుపుతున్న చమురు సంస్థలు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్‌ఎఫ్‌సీఎల్, జీఎఫ్‌సీఎల్, పలు వంట నూనెల శుద్ధి కర్మాగారాలు, సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డులో సిరామిక్స్‌ ఫ్యాక్టరీలు, రాజమహేంద్రవరంలో ఏపీ పేపర్‌ మిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ,  ఎర్రవరం, తాళ్లరేవు, కోరంగి, కామనగరువు, ఈతకోట తదితర ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఫ్రాన్‌ ప్రా సెసింగ్‌ప్లాంట్‌)ల లో ప్రమాదాల నివా రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం
ఎంతైనా ఉంది.

జిల్లాలో గ్యాస్‌ లీకైన సంఘటనల్లో  ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డులకు ఎక్కిన కోనసీమలోని దేవరలంక బ్లోఅవుట్‌. 1995 జనవరి 8న సంభవించిన నాటి ప్రమాదం రెండు నెలలకు పైనే ఆందోళన రేకెత్తించింది. నాడు ప్రజల ప్రాణాలకు ఏమీ కాలేదు కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది.    

2014 జూన్‌ 27న నగరంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ విస్షోటం తీవ్ర విషాదానికి కారణమైంది. నాటి ఘటనలో 22 మంది మృత్యువాత పడగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడేళ్లు కిందట జరిగినా ఇప్పటికీ గుర్తుకు వచ్చినప్పుడల్లా కోనసీమ వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.  

తాజాగా గత ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడిలో మూసేసిన ఓఎన్‌జీసీ బావిలో సంభవించిన గ్యాస్‌ విస్ఫోటం నిలువరించడానికి నాలుగు రోజులు పట్టింది. ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించ లేదు. కానీ ప్రజలు ప్రాణభయంతో ఊళ్లకు, ఊళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

రికార్డు స్థాయిలో కుటుంబానికి రూ.కోటి
విశాఖపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గ్యాస్‌లీకైన ప్రమాదంపై వెనువెంటనే స్పందించి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మృతుల కుటుంబాలకు రూ.కోటి ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డుగా అభివర్ణిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.1లక్ష, గ్యాస్‌ ప్రభావిత ప్రాంతంలో ఇబ్బందులకు గురైన వారికి రూ.25 వేలు ప్రకటించారు. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కానీ ఊహించనివిధంగా పరిహారాన్ని ప్రకటించిన సీఎం చరిత్రలో నిలిచిపోతా రంటున్నారు.  

‘బాబు’ పరిహారం నవ్వులపాలు
మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని చంద్రబాబు సర్కార్‌ పరిహాసం చేసింది. 2014 జూన్‌ 27న నగరంలో గ్యాస్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌ పైపులైన్‌ పేలిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. ‘నగరం’ ప్రమాదంలో 22 మంది దుర్మరణంపాలైతే మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. ఆ పరిహారంలో కేంద్రం రూ.2 లక్షలు, గెయిల్‌ రూ.20లక్షలు...ఇలా అన్నీ కలిపి ఇచ్చింది రూ.25 లక్షలు మాత్రమే.

మరిన్ని వార్తలు