మానవతా మూర్తులు

13 May, 2020 14:18 IST|Sakshi

కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కరోనాని అదుపు చేయడానికి మార్చి 21న లాక్‌డౌన్‌ను ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి వరకు మూడు సార్లు పొడిగించారు. అది మే 17 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పొయారు. చాలా మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితులు కూడా లేక​ ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు. చాలా మంది నిరాశ్రయులు, నిరుపేదలు, వలసకూలీలు ఆకలితో అలమటిస్తోన్నారు. మే 1 నుంచి వారిని ఊళ్లకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోన్న ఇంకా చాలా మంది ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి  ప్రభుత్వాలతో పాటు చాలా  స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యుల సైత్యం సాయం చేస్తోన్నారు. 

కడపజిల్లా మైదుకూరులో నివాసం ఉంటున్న సాయి తేజ రెడ్డి కూన్‌ కా రిస్తా, గాడెస్ పూర్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ద్వారా తమ చుట్టు పక్కల ఉండే వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. పనిరుపేదల కుటుంబాలు ఒక్కొక్కరికి 1.5 కేజీల బియ్యం, 0.5 కేజీల పప్పు, అర కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, ఒక లీటర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ ఇంకా ఇతర నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందజేశారు. దాదాపు 300 కుటుంబాలకు వీటిని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అనంతపురం జిల్లాలో ఇబ్బంది పడుతున్న వారికి యస్‌యస్‌వై సంస్థ తరుపున ఎన్‌. సదా శివరెడ్డి గురూజీ ఆధ్వర్యంలో అన్నదానం, నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు. అనంతపురం గవర్నమెంట్‌ ఆసుపత్రిలోని కరోనా బాధితులతో పాటు, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉపాధి కోల్పొయి ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఆహౠరాన్ని అందిస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు.  

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో జిల్లా మైనారిటీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ షేక్‌ సుభాని, శ్రీశంకర్‌ గ్రాఫిక్స్‌ శ్రీనివాస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసి అండగా నిలిచారు.

హైదరాబాద్‌  సనత్ నగర్ లోని హనుమాన్ గోశాల దగ్గర సేవా కార్యక్రమాలు నిర్వహించే దేవేందర్ కొన్నే తన సహచరులతో కలిసి లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడే పేదల కోసం రోజు ఆహారాన్ని అందిస్తున్నారు. తన సహచరులందరూ కలిసి కూడగట్టిన డబ్బులతో ఇప్పటి వరకు 14,000 మందికి ఆహారపదార్థాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవందర్‌ కొన్నేతోపాటు తులసి కుమార్, సూర్య ప్రకాష్, ఆనంద్, బాల మురళి కృష్ణ, శివ ప్రసాద్, రవి, గడ్డం రవి, వేణు, భజరంగ్, సునీత, హనుమాన్,  లక్ష్మీ, కొన్నే అఖిల, శ్రీకాంత్, పూజ, పాల్గొన్నారు

మీరు కూడా లాక్‌డౌన్‌ సమయంలో చేస్తోన్న సేవ కార్యక్రమ వివరాలు నలుగురికి తెలిపి చాలా మందిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి.

మరిన్ని వార్తలు