పాలకు గిట్టుబాటు ధర లేదయ్యా!

16 Feb, 2018 07:05 IST|Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మేము  గేదెలను మేపి కష్టం చేస్తుంటే అందుకు తగ్గట్టుగా పాలకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు’ అని కొండాపురానికి చెందిన టి.బ్రహ్మయ్య గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయాడు. కష్టపడి గేదలను మేపి, వెన్నతో పాలు విక్రయిస్తే తమ వద్ద లీటరు రూ.35కు కొనుగోలు చేస్తున్నారు. వారు మాత్రం వెన్న తీసి, లీటరు పాలు రూ.50కు అమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన జననేత వైఎస్‌ జగన్‌.. మీ లాంటి పాడి రైతులకు న్యాయం చేయాలని ఉందని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.

మా ఊరికి పండగ వచ్చిందన్నా!
అన్నా.. గత నెల్లో సంక్రాంతి వచ్చింది.. అంతకంటే పెద్ద పండగ మీరు మా ఊరికి వచ్చినపుడు వచ్చిందని కొండాపురానికి చెందిన డి.జయమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గురువారం జననేత వైఎస్‌ జగన్‌ చూసిన ఆమె ఆనందంలో మునిగి తేలింది. ‘మీ వెంట మా ఊరిలో అందరం కలసి నడవాలని, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అన్నా.. మీరు సీఎంగా తిరిగి మా ఊరిద్వారా వెళితే ఇంకా పెద్ద పండగ వచ్చినట్లుగా భావిస్తాం’ అని సంతోషంగా ఆమె చెప్పడం గమనార్హం. స్పందించిన జననేత మీ లాంటి వారి, దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటే మనందరి ప్రభుత్వం తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు