అభిమానం ముందు వైకల్యం చిన్నబోయేలా..

16 Mar, 2018 06:20 IST|Sakshi

గుంటూరు:అతని అభిమాన బలం ముందు వైకల్యం తల వంచింది. వైఎస్‌ వీరాభిమాని అనుపటి వెంకటయ్య అభిమానమే అలుపెరగని ఇంధనంగా మారి నిర్విరామంగా నడిపిస్తోంది. వికలాంగుడైన వెంకటయ్య వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రలో నేనుసైతం అంటూ కర్రసాయంతో అడుగులో అడుగై నడుస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి నేటి వరకు జగన్‌ వెంటనే సాగుతున్నారు. ఇచ్చాపురం వరకు నడుస్తానని ఆయన ధీమాగా చెప్పారు.

మరిన్ని వార్తలు