పంట సాయం అందలేదు..

16 Mar, 2018 06:26 IST|Sakshi

గుంటూరు:‘పొలంలో వేసిన మినప పంట తెగుళ్లు సోకి ఎండిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్ట పరిహారం రాలేదన్నా’ అంటూ పలువురు మహిళలు జననేత ఎదుట వాపోయారు. గురువారం వల్లభరావునిపాలెం గ్రామ శివార్లలో మహిళా రైతులు జననేతను కలసి కష్టాలు చెప్పుకున్నారు. ముందు పంటగా వరి వేస్తే గిట్టుబాటు ధర లేదు. రెండో పంటగా మినుము వేస్తే తెగుళ్లు సోకాయి. రైతు ప్రభుత్వం అని చెప్పే పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని జగన్‌ భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు