అన్యాయంగా ఇంటిని కూల్చేశారు

20 Mar, 2018 06:53 IST|Sakshi

పంచాయితీ స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మించామంటూ మాపై టీడీపీ నాయకులు ఆరోపణలు చేసి ఇందిరమ్మ ఇంటిని కూల్చివేయించారని పెదనందిపాడుకు చెందిన ఐలా వనజాక్షి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. హైకోర్టును ఆశ్రయించగా మూడు నెలల్లోపు ఇంటిని తిరిగి కట్టించాలని ఏడాదిన్నర కిందట కోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికార పార్టీ నాయకుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జగన్‌ ముందు విలపించింది.

కాళ్లు చచ్చుపడినా కనికరించట్లేదు
దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. నా కాళ్లు చచ్చుబడినా ఈ ప్రభుత్వం కనికరించడం లేదంటూ కాకుమాను ఎస్టీ కాలనీకి చెందిన ఆదిపుడి నాగేంద్రమ్మ జగన్‌ను కలిసి తన సమస్యను తెలిపింది. వికలాంగ పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ఆమె చెప్పింది.   

వైఎస్సార్‌ మేలు మరువలేం
టీడీపీ హయాంలో మాపై అక్రమ కేసులు పెట్టారు. మీ నాన్న గారు సీఎం అయ్యాక ఆ కేసులు కొట్టివేశారు. ఆయన మేలు ఎన్నడు మరువలేం అంటూ కొండపాటూరు గ్రామానికి చెందిన మండవ హరిబాబు జగన్‌ను కలిసి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ ఉన్నపుడు సీతారామాంజీనేయులు ఎస్పీగా ఉన్న సమయంలో మాపై అక్రమ కేసులు బనాయించి పలు వేధింపులకు గురి చేశారని 2004లో రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక ఆయన దృష్టికి తీసుకెళ్లగా మాపై పెట్టిన అక్రమ కేసులు తొలగించారని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు