నా భర్తను కాపాడండన్నా..

29 Mar, 2018 07:12 IST|Sakshi

గుంటూరు: ‘అన్నా.. భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం. పంట చేతికి రాకపోయే సరికి నా భర్త ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడేళ్లుగా పంటలు పండక నష్టపోయాం’ అని ఉప్పలపాడుకు చెందిన తాళ్లపోగు వెంకాయమ్మ జననేత జగన్‌ను కలిసి భోరున విలపించింది. ఈ ఏడాది పత్తి పంట సాగు చేస్తే గులాబీ రంగు పురుగు ఆశించి ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర కూడా లేదు. 2.5 లక్షల వరకు అప్పుల పాలయ్యాం.

గత ఆదివారం ఇంట్లో వాళ్లందరూ చర్చికి వెళ్లాక.. ఒక్కడే ఉన్న నా భర్త కోటయ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.20 వేలు బిల్లు కట్టాం. నా భర్తను ఆదుకోండి అన్నా’ అంటూ భార్య వెంకాయమ్మ జననేతను కోరింది. స్పందించిన జగన్‌ అక్కడే ఉన్న ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడి వారికి ఉచిత వైద్యం అందించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు