ఆర్‌ఎంపీ డాక్టర్ల ఉనికిని కాపాడండి

16 Apr, 2018 07:13 IST|Sakshi

కృష్ణా జిల్లా :‘అన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే ఆర్‌ఎంపీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండటంతో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది’ అంటూ అనంతపురం ఆర్‌ఎంపీ వైద్యుల అసోసియేషన్‌ సభ్యులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని పాములకాలువ వద్ద జగన్‌ను కలసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ఆర్‌ఎంపీలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో జీవో నం.428, 429 ద్వారా గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు కూడా అందజేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ తెలంగాణాలో కేసీఆర్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన జీవోలనే అమలు చేస్తోందని, కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా జీవో నం.465ను మొక్కుబడిగా తీసుకువచ్చిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది ఆర్‌ఎంపీలను ఆదుకుంటే గ్రామీణ వైద్యం     మెరుగుపడుతుందన్నారు. జగన్‌ను కలసిన వారిలో  మొయినూద్దీన్, భాస్కరరావు, అబ్ధుల్‌ రజాక్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు