‘అభయ హస్తం’ అందడం లేదు

16 Apr, 2018 07:22 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అభయహస్తం ద్వారా నాకు పింఛను ఇవ్వడం లేదు. దీని కోసం రెండేళ్ల నుంచి అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు’ అని వెలగలేరు ప్రాంతానికి చెందిన బిట్రా మంగమ్మ ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్‌ వద్ద తన బాధను చెప్పుకున్నారు. వెన్నెల డ్వాక్రా గ్రూపునకు చెందిన తనకు అభయహస్తం పథకం ద్వారా పింఛను పొందేందుకు డబ్బులన్నీ కట్టేశానని, దీని ద్వారా 60 ఏళ్ల వయస్సు నిండిన వారికి రూ.1000 పింఛన్‌ వస్తుందని అయితే తనకు 62 ఏళ్లు వచ్చినా ఇప్పటి వరకూ అభయహస్తం ద్వారా పింఛన్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు