నాలుగు నెలలుగా జీతాలు లేవు

3 May, 2018 08:12 IST|Sakshi

కృష్ణా జిల్లా : అన్నా... మేము గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు, ఎంటీఎస్‌ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. మాకు నాలుగు నెలల నుంచి వేతనాలు, పీఆర్‌సీ, డీఏలు రావడం లేదు. దీంతో మా కుటుంబ పోషణ భారంగా మారి మేమంతా అప్పులపాలవుతున్నాం’ అని మచిలీపట్నం ప్రాంతానికి చెందిన సాయిలీల, పుష్పలత తదితర కాంట్రాక్ట్‌ లెక్చరర్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తంచేశారు.

తరచూ తమకు ఇదే సమస్య ఏర్పడుతుందని నెలంతా కష్టపడుతున్నా వేతనాలు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేస్తున్నామని దీంతో వేతనాలు వచ్చిన తరువాత అవన్నీ తీర్చేందుకు, వడ్డీలు కట్టేందుకే సరిపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెల నెలా వేతనాలు అందేలా చూడాలని జగన్‌ను కోరారు. ఎంటీఎస్‌ లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని జననేతకు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు