నా భార్య కష్టంపై బతుకుతున్నాం

17 May, 2018 07:02 IST|Sakshi

పశ్చిమగోదావరి : సర్, నా పేరు కాలి భూషణం, కొమరపల్లి గ్రామం. నేను వికలాంగుడిని. నాకు ఇల్లు లేదు. చిన్న గుడిసెలోనివసిస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వంఇచ్చే ఇల్లు అనేది ఏదీ మంజూరు కాలేదని, ఇబ్బందులు పడుతున్నానని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధను తెలుపుకున్నాడు. బతుకుదెరువు లేక ఇబ్బంది పడుతున్నానని, తన భార్య కూలీ పనిచేసి మా అమ్మను,నన్ను, పిల్లలను పోషిస్తోందని వాపోయాడు.ఎస్సీ రుణం కోసం 2015లో దరఖాస్తు చేసుకుంటే రుణం మంజూరైనా బ్యాంకు నుంచిసొమ్ము అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు