వీల్‌చైర్‌ ఇప్పించమంటే రూ. 4 వేలు లంచం అడిగారు

17 May, 2018 07:11 IST|Sakshi

పశ్చిమగోదావరి : అన్నా... నా పేరు చిక్కాల నాగరాజు. నేను వికలాంగుడ్ని. నడవలేని స్థితిలో ఉన్న నాకు వీల్‌చైర్‌ ఇప్పించాలని మండల ప్రెసిడెంట్‌ను కలిస్తే రూ.4 వేల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారని భీమడోలు మండలం అంబరుపేటకు చెందిన నాగరాజు తన ఆవేదనను పెరుగ్గూడెం వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వెలిబుచ్చాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే తప్పని పరిస్థితిలో తీవ్ర ఇబ్బంది పడుతూ చేతుల సహాయంతో వెళ్తున్నానని, తనను ఆదుకోవాలని జగనన్నను కోరారు.

మరిన్ని వార్తలు