200 ఏళ్లుగా ఉంటే.. ఇప్పుడు పొమ్మంటున్నారు

17 May, 2018 07:14 IST|Sakshi

పశ్చిమగోదావరి:  మా తాత, ముత్తాతల నుంచి సుమారు రెండొందల ఏళ్లుగా దెందులూరు మండలం మలకచర్లలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నాం. పంచాయతీ కుళాయిలు ఉన్నాయి. కరెంటు ఉంది. మా పూర్వీకుల పెళ్లిళ్లు ఈ ఇళ్లలోనే జరిగాయి. పన్నులు కూడా కడుతున్నాం. 2011లో గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో మీ ఇళ్లు దేవస్థాన భూమిలో ఉన్నాయి ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడంతో పాటు, కాకినాడ కోర్టులో కేసు వేశారు. ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నాం. మీరే మాకు రక్షణ కల్పించాలని మలకచర్ల గ్రామానికి చెందిన చింతాల వెంకటేశ్వరమ్మ జగన్‌మోహన్‌రెడ్డిని వేడుకుంది.

మరిన్ని వార్తలు