భర్త చనిపోయినా జాలి చూపలేదు

17 May, 2018 07:16 IST|Sakshi

పశ్చిమగోదావరి :  నా భర్త చనిపోయి రెండేళ్‌లైంది. నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందున ఇప్పటివరకు నాకు వితంతు పింఛన్‌ మంజూరు చేయలేదని రామారావుగూడెంకు చెందిన కొత్తపల్లి సుజాత వాపోయింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అధికారులు కావాలనే నాకు పింఛన్‌ మంజూరు చేయడం లేదని జగనన్నకు తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నానని, కూలి పనులకు వెళ్లి వారిని పోషించుకుంటున్నానని వాపోయింది. -కొత్తపల్లి సుజాత,రామారావుగూడెం

నా భర్త ఉద్యోగం తీసేశారు తనగాల రత్నకుమారి, నాగన్నగూడెం
పశ్చిమగోదావరి 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో మా మరిది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాడు. అది దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అనంతరం ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిన షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నా భర్త తనగాల వెంకట్రావును ఏ కారణం చూపకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి మా కుటుంబం ఎంతో మానసిక, ఆర్థిక క్షోభకు గురవుతోంది. ఈ దుష్టపాలన అంతమై మీరు ముఖ్యమంత్రి అయ్యాక, మా కుటుంబాన్ని ఆదుకోవాలని కొప్పులవారిగూడెం పంచాయతీ నాగన్నగూడెంనకు చెందిన తనగాల రత్నకుమారి దెందులూరు వద్ద పాదయాత్రలో తన వ్యథను జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకున్నారు.

మరిన్ని వార్తలు