భూమి కోసం.. బరితెగింపు

17 May, 2018 07:18 IST|Sakshi

టీడీపీ ప్రజాప్రతినిధులపై మండిపడ్డ రైతులు

స్థలాల కోసమని మా నోట్లో మట్టికొడతారా అంటూ ఆగ్రహం

వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వెళ్లగక్కిన బాధితులు

బిడ్డా.. మా భూములు లాగేసుకుంటారంట..ఓ రైతన్న ఆందోళన..తమ్ముడూ.. నా భర్త చనిపోయాడు.. పింఛను ఇవ్వడం లేదు.. : ఓ అక్క ఆవేదన..అన్నా.. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే ఇస్తున్నారు.. : ఓ తమ్ముడి ఆక్రందన..ఇలా జిల్లాలో బుధవారం సాగిన ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి వద్దటీడీపీ పాలనలో దగాపడ్డ బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ పాలకులుభూమి కోసం బరితెగిస్తున్నారంటూ పలువురు రైతులు తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

పశ్చిమగోదావరి : నా పేరు కొత్తపల్లి వెంకటేశ్వరరావు. మాది శ్రీరామవరం గ్రామం. ఇందిరమ్మప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మాదిగ కులానికి చెందిన నా తండ్రి కొత్తపల్లి ముక్కయ్యకు శ్రీరామవరం గ్రామంలో సర్వే నెంబరు 33/3లో ఎనభై సెంట్ల భూమికి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి మా కుటుంబం ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ప్రస్తుతం మా అన్నదమ్ముల ఇద్దరి అధీనంలో ఉన్న ఈ భూమిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులమనే కక్షతో లాక్కోవాలని చూస్తున్నారు. మాకు ఇచ్చిన పట్టాను రద్దు చేసి ఇళ్ల స్థలాలకు ఇస్తామని తహసీల్దార్‌ చెప్పారు. దీని వెనుక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీటీసీ మోతుకూరి శోభన్‌బాబు(నాని) హస్తం ఉంది. దీనిపై కోర్టుకు కూడా వెళ్లాం. కోర్టు ఆదేశాలు వచ్చే వరకైనా మా భూమి లాక్కోకుండా రక్షణ కల్పించమని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి కలసి విన్నవించుకున్నాం.

నా పేరు కొత్తపల్లి నాగేశ్వరరావు. మా గ్రామం శ్రీరామవరం. మాకున్న కేవలం40 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని కొందరు టీడీపీ నాయకులు దౌర్జన్యంగా భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుకాల ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఉన్నాడు. సుమారు 50 ఏళ్లుగా మా కుటుంబానికి ఈ 40 సెంట్ల భూమే ఆధారం. దాని మీదేఆధారపడి వికలాంగుడినైనా నేను బతుకుతున్నాను. మా భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాలకుకేటాయించకుండా కాపాడాలని జగన్‌మోహన్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశాను.

పథకాలన్నీ వాళ్లే మింగేస్తున్నారుకొత్తపల్లి రవికిరణ్, రామారావుగూడెంఇళ్ల నుంచి మరుగుదొడ్లవరకు, లోను నుంచి పింఛన్‌ల వరకు ఇలా ఏ ఒక్క ప్రభుత్వ పథకం అర్హులకు దక్కనివ్వడం లేదు. జన్మభూమి కమిటీ సభ్యులు వారికి నచ్చిన వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తున్నారు. అదేమని అడిగితే కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటువంటి వారికి బుద్ధి చెప్పాలంటే మీ లాంటి నాయకులు ఈ రాష్ట్రానికి కావాలని రామారావుగూడానికి చెందిన కొత్తపల్లి రవికిరణ్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

మా నాన్న కష్టానికి విలువ ఇవ్వలేదు
మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు కట్టాడు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో రుణం కోసం అర్జీ పెట్టుకోగా గృహనిర్మాణశాఖ అధికారులు చాలాసార్లు వచ్చి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌ బుక్స్‌ జిరాక్స్‌ తీసుకెళ్లారు. ఏడాదైనా లోను మాత్రం రాలేదని రామారావుగూడెం పంచాయతీ మేధినరావుపాలెంనకు చెందిన జొన్నకూటి దివ్య జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -జొన్నకూటి దివ్య, మేదినరావుపాలెం

మరిన్ని వార్తలు