స్థలాలున్నా..ఇళ్లు కట్టుకునే మార్గం లేదు

26 May, 2018 06:51 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన కట్రెడ్డి మోహనరావు తదితరులు

పశ్చిమగోదావరి :గ్రామంలో 5 వేల ఎకరాల ఆయుకట్టు ఉంటే, దానిలో సుమారు 2 వేల ఎకరాలు బీడు భూములున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఉపాధి ఉండటం లేదని పెదకాపవరం గ్రామానికి చెందిన కట్రెడ్డి మోహన్‌రావు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కనీసం ఈ స్థలాలను మెరక చేయలేదు. దీంతో సొంతిల్లు కట్టుకోలేపోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో తాగునీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇళ్లస్థలాలు మెరక చేసి పేదవాళ్లకు సొంతిల్లు కట్టించాలని జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

జననేత కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం
వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆకివీడుకు చెందిన మహ్మద్‌ జహీర్‌ఖాన్, ఎండీ సిద్దిక్, ఎండీ జాకీర్, ఎండీ ఆరీఫ్‌ చిన కాపవరం గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని చెప్పారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థన చేసినట్టు తెలిపారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం టోపీ పెట్టి శాలువా కప్పి సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు