మది మదిలో ఆ స్మృతులు పదిలం

19 Jun, 2018 06:39 IST|Sakshi
ఊడిమూడిలో జగన్‌తో పాటు పాదయాత్రలో నడుస్తున్న ప్రజానీకం

తూర్పుగోదావరి :జననేత పాదయాత్రలో పదం కలుపుతూ ఉత్సాహంగా పాల్గొంటున్న అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ఎన్నెన్నో అనుభూతులు, మరచిపోలేని మధుర స్మృతులు. తమ బిడ్డలను ఆప్యాయంగా ఎత్తుకొని లాలించారని మురిసిపోయే తల్లులు.. ఆ మహా పథికుడి చేతుల మీదుగా తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆనందించే మాతృమూర్తులు.. జగనన్నతో సెల్ఫీలు దిగడం ఎన్నటికీ మరువలేమనే అక్కచెల్లెమ్మలు.. అడిగిన వెంటనే ఆప్యాయంగా ఆటోగ్రాఫ్‌ ఇచ్చారని ఉబ్బితబ్బిబ్బయ్యే అభిమానులు.. తమ సమస్యలను శ్రద్ధగా విని వాటిని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారని సంతోషించే బాధితులు ఇలా ప్రజా సంకల్పయాత్ర ఎందరికో మరువలేని జ్ఞాపకాలను మిగిలుస్తోంది. పాదయాత్ర సోమవారం కొత్తపేట మండలం గంటి నుంచి పి.గన్నవరం వరకు సాగింది.

ఎంతో ఆప్యాయంగాపలకరించారు– రొక్కెల ఆదిలక్ష్మి, బెల్లంపూడి
నన్ను జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ను కలువగా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా బాగోగులు అడిగి తెలుసుకోవడం ఆనందంగా ఉంది.

ఏడేళ్లుగా పింఛను ఇవ్వడం లేదు– చింతా సత్యవతి, ఊడిమూడి
తూర్పుగోదావరి :నా భర్త చనిపోయి ఏడేళ్లు అయింది. అప్పటి నుంచి పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిరుపేదరాలైన నాకు పింఛను ఇచ్చి ఆదుకోవాలి.

జగన్‌కే ఓటు వేస్తాను– చింతపల్లి రత్తమ్మ, జి.పెదపూడి.
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేసి గెలిపిస్తాను.

మరిన్ని వార్తలు