జనహృదయ విజేత

14 Nov, 2018 06:47 IST|Sakshi
అధినేతతో అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే పీడికరాజన్నదొర, పార్వతీపురం సమన్వయకర్త జోగారావు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్యవకర్త మజ్జిశ్రీను

ప్రతిపక్షనేతపై ప్రేమానురాగాలు కురిపిస్తున్న ప్రజలు

ఆప్యాయంగా వారిని పలకరించి గోడు వింటున్న జగన్‌

స్థానిక సమస్యలపై జనాన్ని ప్రశ్నిస్తున్న జననేత

పార్వతీపురం నియోజకవర్గంలో అడుగిడిన పాదయాత్ర

అడుగడుగునా పోటెత్తిన జన ప్రవాహం

సాక్షిప్రతినిధి, విజయనగరం: గుండె గడపకు పండగొచ్చింది. జన హృదయం ఉప్పొగింది. జగమంత అభిమానం వెల్లువెత్తింది. చెరగని చిరునవ్వుతో తమ కష్టాలు వినేందుకు ముంగిటకు వచ్చి న రాజన్న బిడ్డను చూసి ఆనందపారవశ్యమైంది. ప్రజా కంటక పాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్‌సీపీ అ«ధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న జ నం ఆయనపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. తమకోసం వచ్చిన రాజన్నబిడ్డను చూసి గుండెల్లో ఆత్మస్థయిరాన్ని ప్రోదిచేసుకుంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ఇప్పటివరకూ ఐదు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమ ర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, సాలూ రు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని మంగళవా రం మధ్యాహ్న భోజన విరామ సమయానికి పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

296వ రోజు పాదయాత్ర సాగిందిలా...
ప్రజా సంకల్పయాత్ర 296వ రోజైన మంగళవారం మక్కువ మండలం కొయ్యానపేట శివారులో ఏర్పాటుచేసిన శిబిరం నుంచి ప్రారంభమై కం చేడువలస క్రాస్, వైంకటభైరిపురం మీదుగా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా నియోజ కవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో జననేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో సాలూరు నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఘ న వీడ్కోలు పలికారు. మధ్యాహ్న భోజన విరా మం అనంతరం సీతానగరం మండలం బగ్గందొ రవలస, గెడ్డలుప్పి జంక్షన్, తామరఖండి మీదుగా రాత్రి శిబిరం వద్దకుచేరుకున్నారు. పాదయాత్రలో తామరఖండి వద్ద పిట్టగంగమ్మ జననేత జగన్‌కు గొర్రె పిల్లను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పార్వతీపురంలో ఘనస్వాగతం
అభిమాన నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వ ర్యంలో డప్పుల వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వేలాది మంది అభిమానులు జయజయ ధ్వానాల నడుమ స్వాగతించారు.  నాలుగేళ్ల రాక్షస పాలనలో అవస్థలు పడుతున్న ప్రజలు తమ కష్టాలు తీర్చే నాయకుడు వస్తున్నాడన్న ఆనం దంతో భారీ సంఖ్యలో పాదయాత్ర మార్గానికి చేరుకుని జై జగన్‌... జైజైజగన్‌... జగన్‌ కావాలి... జగన్‌ రావాలి అంటూ పెద్ద పెట్టున నినదించారు. పెద్ద సంఖ్యలో అభిమానులంతా జగన్‌ వెంట అడుగులు వేశారు.

జగనన్నా మా కష్టం తీర్చన్నా...
ఎన్ని కష్టాలు ఎదురైనా... ప్రత్యర్థులు ఎన్ని కుతంత్రాలు పన్నినా వాటన్నింటినీ చిరునవ్వుతో ఛేదిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ముం ద డుగు వేస్తున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. పాదయాత్రలో ఆయన వద్దకు కష్టాలు చెప్పుకునేందుకు బారులు తీరుతున్న బాధితులే దీనికి తార్కాణంగా నిలుస్తున్నారు. మంగళవారం పాదయాత్ర ప్రారంభంలో వైఎస్‌ జగన్‌ను కలిసిన కొయ్యానపేట మహిళలు తమ సమస్యలను వివరించారు. పింఛన్లు, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మం జూరు చేయటం లేదని, చివరకు రేషన్‌కార్డులూ ఇవ్వటం లేదని వాపోయారు. గ్రామంలో అంగ న్వాడీకి సొంత భవనం లేక 30 మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకున్నారు. ఆం ధ్రా –ఒడిశా సరిహద్దులో ఉన్న తమ గ్రామాని కి సరైన రహదారి లేకపోవటం విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, సైకిళ్లపై వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీనిధి డబ్బులు ప్రభుత్వం మం జూరు చేయటం లేదన్నారు. మరో వైపు జననేతను కలి సిన మక్కువ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు కళాశాలల్లో కనీస సదుపాయాలు లేకపోవటంతో పడుతున్న ఇబ్బందులను చెప్పారు. కింద కూర్చు ని చదువుకుంటున్నామని, మరుగుదొడ్ల సౌకర్యం లేదని, కళాశాలకు ప్రహరీ లేకపోవటంతో అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంగళరాయ సాగర్‌ ప్రాజె క్టు ఆధునికీకరణ పనులు జరగకపోవటంతో సా గు కష్టతరంగా మారుతోందని, కాలువలకు గం డ్లు పడినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవటంతో పంటను నష్టపోవాల్సి వస్తోందని వెం కటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. వెంకటభైరిపురం, శిర్లాంతో పాటు మరో మూడు గ్రామాల్లో పశువైద్య శాలలు లేక ఇబ్బందులు పడుతున్నారని  పలువురు రైతులు జననేత దృష్టికి తీసుకువచ్చారు. గెడ్డలుప్పి జంక్షన్‌ వద్ద జననేతను కలిసిన స్థానికులు సువర్ణ్ణముఖి నదిపై నిర్మిస్తున్న వంతెన పనుల్లో జాప్యంపై ఫిర్యాదు చేశారు. జగన్‌ స్వయంగా వంతెన వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్‌ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.

నాయకుడు వెంట నడిచిన సైనికులు: పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ ఆళ్లనాని, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్వతీపు రం, బొబ్బిలి, ఎచ్చెర్ల, పాతపట్నం సమన్వయకర్తలు అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డిశాంతి, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసనాయుడు, మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు మావుడి రంగునాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు