జన హితుడు

29 Aug, 2018 07:01 IST|Sakshi
హరిపాలెంలో జననేత వెంట నడుస్తున్న జనతరంగం జగనన్నకు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న విద్యార్థిని

ఊరూరా..ఉత్సవం

ఎటు చూసినా జనసంబరం

జననేత వెంట కదం తొక్కుతోంది జనప్రభంజనం

అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పాదయాత్ర

దారిపొడవునా వెల్లువెత్తుతున్న వినతులు

సాక్షి, విశాఖపట్నం: జనహితుడు జగనన్న రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకుంటోంది. ఎటు చూసినా జనసంబరమే..రాజన్న రాజ్యం రావాలి..రాక్షస పాలన పోవాలంటూ ఘోషిస్తోం ది జనప్రభంజనం. అలుపెరగని యోధునికి  అపూర్వ స్వాగతం పలుకుతోంది. కదం తొక్కు తూ.. పదం పాడుతూ పదండి పోదాం పైౖపైకీ అన్న ట్టుగా దూసుకెళ్తోంది ప్రజా సంకల్పయాత్ర.
 నాలుగున్నరేళ్ల నరాకాసురుని పాలనలో పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టడమే కాదు..ఈ ప్రభుత్వం సాగిస్తున్న దౌర్జన్యాలు..దుర్మార్గాలను ప్రజలు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు ప్రజలు. ప్రజాకంటక పాలన తుదముట్టించే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర మంగళవారం అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో జనజాతరను తలపించేలా సాగింది.

పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్ప పాదయాత్ర 248వ రోజు మంగళవారం కొండకర్ల జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి అందలాపల్లి, హరిపాలెం, అచ్యుతాపురం మండలం తిమ్మరాజు పేట మీదుగా మునగపాక మండలం తిమ్మరాజుపేటలోకి అడుగుపెట్టింది. అక్కడ నుంచి తిమ్మరాజుపేట శివారు ఇటుకబట్టీల ఏరియా వరకు సాగింది. అడుగడుగునా మహిళలు హారతులు...పూర్ణకుంభంతో స్వాగతాలు పలుకగా..రైతులు చెరుకు గెడలతో స్వాగతం పలికారు. 90 ఏళ్లు పైబడి నడవలేని వృద్ధులు సైతం రాజన్న బిడ్డను చూడాలని గంటల తరబడి నడిరోడ్డులోనే నిరీక్షిస్తున్నారంటే జననేతపై ఏ స్థాయిలో అభిమానం పెంచుకున్నారో అర్థమవుతోంది. చిన్నారులు..యువత అయి తే చెప్పనక్కర్లేదు. జననేత వెంట పరుగులే పరుగులు. ఆయనను చూడాలి..కరచాలనం చేయాలి..మదిదోచే సెల్ఫీలు తీసుకోవాలి అంటూ ఒకటే ఉత్సాహం. ఐదు కిలోమీటర్ల నడకకు మం గళవారం ఏకంగా నాలుగు గంటల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో జనకెరటం ఎగసిపడిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న జనస్పందనను చూసి ఎలాగైనా జగన్‌ అడుగులో అడుగువేయాలన్న సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చింతలపాటి శ్రీనివాసరావు ఏకంగా కథర్‌ నుంచి విశాఖకు చేరు కుని జననేత వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. అంతేకాదు..విశాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు, యువత హరిపాలెం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు.

దారిపొడవునా సమస్యల హారతి
పాదయాత్రలో జననేతతో మమేకమైన జనం వారి కష్టాలను చెప్పుకున్నారు. రామగిరికి చెం దిన పల్లా శ్రీలక్ష్మి తన కుమారుడు జ్ఞానవర్దన్‌కు మాటలు రావడం లేదని ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడం లేదని వాపోయింది. 1700 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న కొండకర్ల ఆవను 500 ఎకరాలకు కుదించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటున్నారని, అలా చేస్తే ఆవపై ఆధారపడిన 3 వేల ఎకరాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని ఆవ రైతులు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. హరిపాలెంలో కుమ్మరి సామాజిక వర్గీ యులు కలిసి తమకు ఎవరు రుణాలు ఇవ్వడం లేదని, ఉపాధి లేక పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. చేతి వృత్తిని నమ్ముకున్న తమలాంటి వారిని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తప్పక ఆదుకుంటామని భరోసా ఇవ్వడమే కాదు..వారితో కలిసి సారేచక్రం తిప్పారు. కుండను సరిచేశారు. శారదానదిపై ఆనకట్ట కట్టేందుకు మహానేత వైఎస్సా ర్‌ రూ.60 కోట్లు మంజూరు చేశారని, ఆయన హఠన్మరణం తర్వాత ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని, ఈ ఆనకట్ట లేకపోవడంతో మా పొలాలన్నీ ముంపుబారిన పడుతున్నాయని సోమలింగపాలెం గ్రామ రైతులు జగన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

తక్షణమే ఈ ఆనకట్ట నిర్మించాలని కోరారు. ఎన్టీపీసీ యాష్‌పాండ్‌ వల్ల కాలుష్యం వల్ల ప్రతి ఇంట్లోనూ ఒకరు కిడ్నీ, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పెదగంట్యాడ మండలం పిట్టవానిపాలెం గ్రామ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్లకార్డులతో తిమ్మరాజుపేట వద్ద ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా ప్రాంత ఎమ్మెల్యేకు చెబితే ఏమాత్రం పట్టించుకోలేదని, మా గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించి బతికే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. తప్పకుండా న్యాయం చేస్తా అని వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. తామంతా బెల్లం తయారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నామని, గిట్టుబాటు కాకనష్టపోతున్నామంటూ తిమ్మరాజుపేట బెల్లం రైతులు జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ హయాంలో నల్లబెల్లం తయారీపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావన్నారు. ప్రస్తుతం బెల్లం రైతులు తీవ్ర నష్టాలను చూస్తున్నారని, వైఎస్‌ మాదిరిగా మీరు ఆదుకోవాలంటూ మొరపెట్టుకున్నారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని పీహెచ్‌సీ కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్లు వినతిపత్రం సమర్పించారు. ఇలా దారిపొడవునా వందల వినతులు వెల్లువెత్తాయి.

పాదయాత్రలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, రైతు విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, సమన్వయకర్తలు యు.వి.కన్నబాబు, కరణం ధర్మశ్రీ, పాతపట్నం సమన్వయకర్త రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఉప్పలపాటి సుకుమార్‌ వర్మ, ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు, రైతు విభాగం కృష్ణా జిల్లా కార్యదర్శి సుభాష్‌ చంద్రబోస్, ఉత్తరాంధ్ర కార్యదర్శి త్రినాథరెడ్డి, రూరల్‌ జిల్లా అధ్యక్షుడు సుంకర రుద్రి, పిఠాపురం మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండేపల్లి బాబి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, రుత్తల ఎర్రాపాత్రుడు, పాయకరావుపేట నుంచి రాయి రమేష్, మండకశిర నుంచి జె.సోమనాథరెడ్డి,  రాష్ట్ర కార్యదర్శి తాడి విజయభాస్కరరెడ్డి, తాడి జగన్నాథరెడ్డి, రాష్ట్ర యూత్‌ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, పద్మనాభం మండలపార్టీ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, మునగపాక ఎంపీపీ దాసరి గౌరిలక్ష్మి, మాజీ ఎంపీపీలు చేకూరి శ్రీనివాసరాజు, ఎస్‌.వి.వి.రమణమూర్తి, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ పూర్ణ, జిల్లా నాయకులు డి.శంకరరావు, అంజూరి అప్పారావు, నమ్మి వెంకటరావు, మళ్ల బుల్లిబాబు, గణపతిరాజు కిరణ్‌రాజు, వడిశల మురళి, పైలా ముత్యాలనాయుడు, మారిశెట్టి సూర్యనారాయణ, డి.మత్స్యరాజు, కాండ్రేగుల శ్రీహరి, గిలకంశెట్టి కాంతారావు, ధర్మాల శ్రీనివాసరావు, కోన లచ్చన్నాయుడు, శరగడం జగ్గారావు, చొప్పా రాము, గంపనబిల్లి శ్రీనివాసరావు, బవిరిశెట్టి రవికుమార్, ఉప్పులూరి నాయుడు, నానేపల్లి సాయి వరప్రసాద్, శరగడం వెంకట జగన్నాధరావు, దాట్ల కృష్ణ భూపతిరాజు, పలాస నుంచి డాక్టర్‌ త్రినాధ్, మల్కిపురం నుంచి చింతలపాటి వెంకటపతిరాజు, సాయిరాజ్, కడప నుంచి వీరప్రతాప్‌రెడ్డి, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు