ప్రజలే బుద్ధి చెబుతారు..

31 May, 2018 16:01 IST|Sakshi

సాక్షి, విశాఖ పట్టణం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం అవినీతికి నిలయం. బీజేపీ పార్టీపై అనవసరమైన నిందలు వేస్తూ, రాద్దాంతం చేస్తున్నాడే తప్ప పరిపాలనను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. రోజంతా అమరావతి జపమే తప్ప, ప్రజల బాగోగులపై ఏమాత్రం శ్రద్దలేదని ఏపీ బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ 2019 ఎన్నికల్లో ఏపీలో స్వతంత్రంగానే పోరాటం చేస్తుందని, ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం ఇచ్చి బలమైన శక్తిగా ఎదుగుతామని ఆయన తెలిపారు.

పెట్రోలు, డీజిల్‌ విషయాల్లో మమ్మల్ని అనవసరంగా నిందిస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వ హయాంలోనే వీటి ధరలకు కల్లెం వేశాం. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. టీటీడీ విషయంలో రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై ధీటైన సమాధానం చెప్పలేకే, ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు. టిటిడి వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గుతేల్చాలి. మాపై గోబెల్స్ ప్రచారం చేస్తోన్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తట్టా, బుట్ట సర్దుకోవడం ఖాయమని సురేష్‌ రెడ్డి ద్వజమెత్తారు. 

మరిన్ని వార్తలు