ప్రజల ఆకాంక్ష ఢిల్లీని తాకాలనే సమైక్య శంఖారావం

23 Oct, 2013 03:32 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి చాటి చెప్పాలనే లక్ష్యం తోనే పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సమై క్య శంఖారావం విజయవంతానికి రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన వారు మంగళవారం దానవాయిపేటలోని పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ఈ సభ పూర్తిగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో సమైక్యతకు కట్టుబడిన  పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, దానికోసం చిత్తశుద్ధితో కృషిచేస్తున్న నేత జగన్ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
 
 అందుకే రాష్ట్రం నలుమూలల నుంచి సమైక్యవాదులు భారీగా రానున్నారని చెప్పా రు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 20 వేలకు పైగా ప్రజలు ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. అంతే కాకుం డా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన సెటిలర్లు కూడా వేలాదిగా సభకు తరలి వచ్చేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢ సంకల్పానికి ప్రతి రూపంగా సమైక్య శంఖారావం సభ నిలుస్తుందన్నారు. ఢి ల్లీ పెద్దలకు బుద్ధి చెప్పేలా ఈ సభను విజయవంతం చేయాలని సమైక్యవాదులకు ఆదిరెడ్డి పిలుపునిచ్చారు. ‘రాష్ట్రం విడిపోతేసీమాంధ్రకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది.
 
 ఆదాయ వనరులు మృగ్యం అవుతాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ఎడారి అవుతుందనే వాస్తవాన్ని ఈ సభ ద్వారా జగన్ ప్రజల్లో చైతన్యం తెస్తారు’ అని ఆదిరెడ్డి అన్నారు. రాజమండ్రి సిటీ కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి నుంచి వేలాదిగా సమైక్య వాదులు హైదరాబాద్ తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ నాయకుడు బొడ్డు వెంకట రమణచౌదరి, ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, నియోజకవర్గ సమైక్యాంధ్ర ఉద్యమ పర్యవేక్షకులు ఆర్‌వీవీఎస్ సత్యనారాయణ చౌదరి, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు