పెళ్లయిన ఐదు రోజలకే..

16 Mar, 2020 12:27 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రైలు పట్టాలపై  పడి నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి మోపూరి శంకర్ రెడ్డి (26) అనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కాగా శంకర్‌ రెడ్డికి ఐదు రోజుల క్రితమే కమలాపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నవవరుడు ఆత్మహత్యతో కొప్పోలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు