భారమని‘పించనే లేదు’

23 Jul, 2019 14:08 IST|Sakshi
నడవలేని తల్లిని భుజంపై పెట్టుకుని వచ్చిన వెంకన్న

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): నడవలేని తల్లిని భుజాన వేసుకుని వచ్చాడు ఆ కొడుకు. అతని పేరు వెంకన్న. భీమవరం లెప్రసీ కాలనీలో నివాసం. చేసేది తాపీపని. అతని తల్లి రమణమ్మ వయస్సు 73 ఏళ్లు నడవలేదు. పింఛన్‌ రావడం లేదు. ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేదు. మండల కార్యాలయంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా.. స్పందన లేదు. దీంతో స్నేహితుల సలహా మేరకు ఏలూరు కలెక్టరేట్‌కు సోమవారం వచ్చారు. తన తల్లిని భుజాలపై వేసుకుని ఇలా కలెక్టరేట్‌ వద్ద కనిపించాడు. ఇలా భుజాలపై వేసుకున్నావ్‌ ఇబ్బందిగా లేదా అంటే.. భారమనిపించనే లేదని.. పింఛన్‌ వస్తుందని ఆశ అని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు