గుంటూరు జిల్లాలో పెథాయ్‌ ప్రభావం

15 Dec, 2018 14:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్‌టీజీఎస్‌) తెలిపింది. తుఫాను శ్రీహరికోటకు 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయని పేర్కొంది. 17వ తేదీ సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్న తుఫాను గమనాన్ని ఆర్‌టీజీఎస్‌ నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆర్‌టీజీఎస్‌లో తుఫాను పరిస్థితులను ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్‌ సెంటర్‌ నుంచి తుఫాను జాగ్రత్తల సందేశాలు జారీ అవుతున్నాయి. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మత్స్యకారుల పడవలు తీరంలోనే నిలిచిపోయాయి. తుఫాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్‌టీజీఎస్‌లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. 

గుంటూరు జిల్లాలో తుఫాను ప్రభావం
గుంటూరు : జిల్లాలో పెథాయ్‌ తుఫాను ప్రభావం కన్పిస్తోంది. తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి పెరిగింది. బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్రం ఇరవై అడుగుల ముందుకు వచ్చింది. సముద్రంలో అలల ఉధృతి సైతం పెరిగింది. బీచ్‌లోకి పర్యాటకులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

మరిన్ని వార్తలు