'బ్రాహ్మణీ' భూములపై హైకోర్టులో పిటిషన్

28 Jun, 2013 15:24 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ జిల్లాలో బ్రాహ్మణీ స్టీల్ కర్మాగారం నిర్మాణానికి కేటాయించిన భూములకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కర్మాగారానికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.
దీనికి సంబంధించి సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని  అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

 దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విశాఖ ఉక్కుకంటే పది రెట్లు పెద్దదైన ఉక్కు కర్మాగారాన్ని జమ్మలమడుగు సమీపంలో నిర్మించతలపెట్టారు. సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ కర్మాగారంతో రాయలసీమ అభివృద్ధి చెందుతుందని భావించారు.

మరిన్ని వార్తలు