మళ్లీ భగ్గుమన్న ‘పెట్రో’ ధరలు

17 Mar, 2016 01:49 IST|Sakshi

లీటర్ పెట్రోల్‌పై రూ.3.02,
డీజిల్‌పై రూ. 2.17 పెంపు
జిల్లా వాహనదారులపై
రోజుకు రూ. 22లక్షల భారం

 
తిరుపతి మంగళం: పెట్రోల్ , డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. లీటరు పెట్రోల్‌పై రూ.3.02లు, డీజిల్‌పై రూ.2.17లు పెంచుతూ బుధవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపాయి. జిల్లాలో సుమారు 46లక్షల వాహనాలు ఉన్నాయి. ఇండియన్ కార్పొరేషన్, హిందూస్థాన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కంపెనీలు రోజుకు పెట్రోల్ 3.6 లక్షల లీటర్లు, డీజల్ 4.8లక్షల లీటర్లను విక్రయిస్తున్నాయి. 

ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.61.97లు, డీజిల్ లీటర్ ధర రూ.52.10లు ఉన్నాయి.  పెరిగిన ధరలతో పెట్రోల్ లీటరు రూ.64.99లు, డీజల్ లీటరు రూ. 54.27లు అయ్యింది. పెరిగిన ధరల కారణంగా జిల్లాలోని వాహనదారులపై రోజుకు సగటున  రూ.22లక్షల భారం పడనుంది. మళ్లీ పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు