పీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్ చేయూలి

25 Aug, 2014 01:52 IST|Sakshi

విజయనగరం అర్బన్ : ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలను తక్షణమే ఆన్‌లైన్ చేయూలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పట్టణంలోని అమర్ భవనంలో ఆ సంఘ జిల్లా స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రూ.కోట్ల నిధులతో ఉన్న ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలను తక్షణమే ఆన్‌లైన్ చేసి పారదర్శకంగా ఉంచకపోతే జిల్లా పరిషత్ కార్యాలయూన్ని ముట్టడించేందుకు నిర్ణయించింది. పదో పీఆర్‌సీని వెంటనే అమలు చేయూలని, అన్ని విద్యా సంస్థలను ఒకే గొడుగు కొందకు తేవాలని, అందరికీ కనీసం 62 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరింది. డీఎస్సీ - 2014 నోటిఫికేషన్ వెలువరించే ముందు విధిగా ప్రమోషన్లు, బదిలీలు,
 
 రేషనలైజేషన్ ప్రక్రియలను చేపట్టి పూర్తి చేయూలని తీర్మానించింది. మోడల్ స్కూల్ సిబ్బందికి రావాల్సిన ఐఆర్, డీఏలు వెంటనే చెల్లించాలని, 610 జీఓపై బదిలీ కాకుండా ఈ జిల్లాలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతలు కల్పించాలని సమావేశం కోరింది. మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా 60 సంవత్సరాల పదవీ విరమణ వర్తింపజేయూలని తీర్మానించింది. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పతివాడ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ జోసెఫ్, రాష్ట్ర కార్యదర్శి జీవీకే నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మింది రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు