ఫొటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత

7 Aug, 2014 02:16 IST|Sakshi

కానూరు(పెనమలూరు) : నేటి సమాజంలో ఫొటోగ్రఫీకి ఎక్కడలేని ప్రాధాన్యత ఉందని, ప్రతి విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపేది ఫొటోనే అని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి పి.మాణిక్యాలరావు అన్నారు. ఆయన బుధవారం కానూరులో జరుగుతున్న  మేగాఫొటో ట్రేడ్‌షోను సందర్శించి ప్రసంగించారు. సమాజంలో ఫొటోగ్రఫీ అనేక సమస్యలకు పరిష్కారమార్గం చూపుతుందని చెప్పారు.

వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, సమాజానికి ఫొటోగ్రఫీకి   విడదీయరాని బంధం ఉందని తెలిపారు. నేడు ఫొటోగ్రఫీలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో రావడంతో ఆ రంగం సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేసే విధంగా తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. మాదాల రమేష్, జి.శ్రీనివాస్, టి.జానకిరామయ్య  పాల్గొన్నారు.
 
నేటితో ట్రేడ్‌షో ముగింపు..

కానూరులో  రెండు రోజులుగా జరుగుతున్న ఫొటో ట్రేడ్‌షో నేటితో ముగుస్తుంది.
 

మరిన్ని వార్తలు