‘చిత్ర’మైన విస్మరణ

31 Dec, 2015 00:23 IST|Sakshi

 లబ్ధిదారుల ఫొటోలు లేకుండానే రేషన్‌కార్డులు
 జిల్లాలో 1.30 లక్షల కార్డులది ఇదే పరిస్థితి
 2 నుంచి మూడోవిడత జన్మభూమి-మాఊరు
 పేదల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం నిరాశే..!
 
 ఆత్రేయపురం : ‘తాళం వేసితి.. గొళ్లెం మరిచితి..’ అని తన తింగరితనాన్ని ప్రదర్శిస్తుంది ‘యమగోల’ సినిమాలో చిత్రగుప్తుని పాత్ర. కొత్త రేషన్‌కార్డుల రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగం నిర్వాకం ఆ బాపతుగానే ఉంది. కొత్త రేషన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పేదలకు కార్డులైతే వచ్చారుు కానీ.. వాటిపై వారి ఫొటోలు లేవు. దీంతో ఇటు కార్డుదారులు నిట్టూరుస్తుండగా.. వాటిని పంపిణీ చేసే గడువు దగ్గర పడడంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 రెండోవిడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో వాటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అర్హులకు మంజూరైన కార్డులు మండల కార్యాలయూలకు వచ్చినా అందులో ఫొటోలు మాత్రం మాయమయ్యాయి.  ఆత్రేయపురం మండలంలో సుమారు 1,700 రేషన్ కార్డులు లబ్ధిదారుల ఫొటోలు లేకుండానే జిల్లా కార్యాలయం నుంచి వచ్చారుు. జిల్లాలోని 64 మండలాల్లో సుమారు 1.30 లక్షల కార్డులు ఫొటోల్లేకుండానే వచ్చినట్టు అంచనా. రేషన్ కార్డులు రూపొందించే పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన జిల్లా అధికారులు ఆ ప్రక్రియను ఓరకంటనైనా చూడలేదనడానికి ఫొటోలు లేకుండానే పంపిణీ చేయండంటూ పంపిన రేషన్‌కార్డులే సాక్ష్యం.
 
 రెండోరోజుల్లో అయ్యేపనేనా..!
 ఇప్పుడు వచ్చిన కార్డులను జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే 3వ విడత జన్మభూమి - మాఊరులో పంపిణీ చేయూల్సి ఉండగా ఫొటోలు లేకుండా వచ్చిన కార్డులను చూసి స్థానిక అధికారులు అవాక్కయ్యూరు. విషయం తెలిసిన కార్డుదారులు ఇన్నాళ్ల ఎదురుచూపునకు తెరపడుతుందనుకునే వేళ ఇలాంటి అవాంతరం వచ్చిందని నిట్టూరుస్తున్నారు. ఫొటోలు లేని కార్డులను వెన క్కి పంపించి, వాటిలో ఫొటోలు పొందుపరిచే ప్రక్రియను ఆదరాబాదరా చేరుుంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుల ఫొటోలతో కూడిన సీడీలను జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నారు. అరుుతే..  కేవలం మరో రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల కార్డుల్లో ఫొటోలను పొందుపరచడం సాధ్యం కాదని ప్రభుత్వవర్గాలే అంటున్నారుు. ప్రై వేట్ సంస్థల పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, లోపాలుంటే సరి చేరుుం చాల్సిన అధికారుల అలసత్వం ఫలితమే ఫొటోలు లేని కార్డులన్నది ని స్సందేహం. సాంకేతిక సమస్య వల్ల ఫొటోల్లేని కార్డులొచ్చాయని అధికారు లంటున్నా మండల కార్యాలయూలకు చేరే వరకూ పొరపాటును గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఏదేమైనా..3వ విడత జన్మభూమి-మాఊరు లో ఈ విషయంపై జనం నుంచి తీవ్ర నిరసన ఎదురయ్యే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు