పిడుగురాళ్లలో భూకంపం

11 Jun, 2016 01:22 IST|Sakshi

సెకన్లపాటు కంపించిన భూమి
ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన జనం
 

పిడుగురాళ్ల : మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీస్తుండగా ఒక్కసారిగా ధభేల్‌మనే శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు రామయ్య... ఇదేం శబ్దమని ఇరుగుపొరుగు వారు కూడా భయంతో గృహాల్లో నుంచి బయటకు పరిగెత్తారు. అందరూ ఒకచోటకు చేరి ఏమైందంటూ చర్చించుకున్నారు. భూకంపం వచ్చిందని ఓ పెద్దాయన చెప్పాడు. దీంతో వామ్మో పిడుగురాళ్లకు భూకంపం వచ్చిందా అంటూ పట్టణవాసులంతా ఉలిక్కిపడ్డారు.

పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుతో పాటు జానపాడు రోడ్డు, బస్టాండ్ సమీపంలో, పిల్లుట్ల రోడ్డు, శివాలయం బజారు, గంగమ్మగుడి ప్రాంతాలలో పెద్ద శబ్దం వచ్చింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వ్యాపారులు కూడా భూకంప శబ్దంతో దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్దం వచ్చిందే త;్ఛజి; గృహాలు, షాపుల్లోని సామాన్లు కింద పడడం వంటి సంఘటనలు జరగలేదు.  మధ్యాహ్నం 3.10 గంటలకు ఒక్క సెకను ఈ ఘటన సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
 

>
మరిన్ని వార్తలు