మనవాళ్లయితే ఓకే..

1 Feb, 2019 14:06 IST|Sakshi

టీటీడీ బోర్డు ఆమోదాలకు తరచూ తిలోదకాలు

వారికి అనుకూలంగా మారిపోతున్న నిర్ణయాలు

ఓ అధికారి నియామకంలోనూ ఇదే వైఖరి సందిగ్ధంలో టీటీడీ అధికారులు..

తిరుమల కొండపై ఏం చేయాలన్నా టీటీడీ ఆమోదం తప్పనిసరి. బోర్డుదే తుది నిర్ణయం. ఇటీవలి కాలం లో పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు ఒకలా.. వారు అమలు చేస్తున్న నిర్ణయాలు మరోలా ఉంటున్నాయి. టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో పాలకమండలి నియమాకం జరిగినప్పటి నుంచి మండలి నిర్ణయాలకు విలువే లేకుండా పోతోంది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం తదుపరి సమావేశంలోనే పక్కకుపోతోంది. పాలకమండలి తీరు టీటీడీ అధికారులను తికమక పెడుతోంది.

చిత్తూరు, తిరుమల: కొంతకాలంగా టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు అధికారులను గందరగోళంలో పడేస్తున్నాయి. డెçప్యుటేషన్‌పై టీటీడీకి వచ్చే అధికారులను మూడేళ్లకు మించకుండా సొంత గూటికి పంపించాలని, ఒకసారి టీటీడీలో విధులు నిర్వహించినవారిని మళ్లీ డెప్యుటేషన్‌పై తీసుకోకూడదని గతేడాది అక్టోబరులో పాలకమండలి నిర్ణయించింది. మూడు నెలలకే ఆ నిర్ణయానికి తిలోదకాలిచ్చింది. తిరుమలకు డెçప్యుటేషన్‌పై వచ్చిన ఏవీఎస్‌ఓ చిరంజీవికి మూడేళ్లు పూర్తయినా మరో ఏడా ది కొనసాగించేలా జనవరి 9న పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తాను తీసుకున్న నిర్ణయాన్ని తుంగలోకి తొక్కి ఆయన పొడిగింపునకు సై అనేసింది. టెంపుల్‌ సెక్టార్‌ ఏవీఎస్వో కూర్మారావు కాలపరిమితి గురువారం ముగియడంతో అత్యంత కీలకమైన ఆ సెక్టార్‌ను చిరంజీవికి అప్పగించింది. ఈయన సతీమణి కడప జిల్లా వాసి కావడం.. చిరంజీవి సామాజిక వర్గం ఈ నిర్ణయం వెనుక పాత్ర పోషించాయని తెలిసింది. కడప జిల్లా నేతలతో పాటు చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ నుంచి భారీ ఎత్తున పైరవీలు చేసుకుని ఏవీఎస్వోగా బాధ్యతలు దక్కించుకున్నారని సమాచారం. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో టీటీడీ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గోపినాథ్‌ జెట్టి ఈ నియామకాన్ని చేయాల్సి వచ్చింది. తన నిర్ణయాలను తానే బేఖాతరు చేస్తూ టీటీడీ పాలకమండలి వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈ నిర్ణయాలు అధికారులను అయోమయానికి గురిచేస్తున్నట్లుఅర్థమవుతోంది.  ఏ నిర్ణయాన్నయియినా తమకు అనుకూలంగా మార్చివేయవచ్చన్నట్టుంది పాలకమండలి శైలి.

కల్యాణమండపాల్లోనూ అదే తంతు
కల్యాణ మండపాల విషయంలో కూడా పాలకమండలి అదే తంతును కొనసాగిస్తోంది. ఆరు నెలల పాటు కొత్త కళ్యాణమండపాల నిర్మాణానికి ఆమోదం తెలపకూడదని గతేడాది ఆగస్టులో పాలకమండలి నిర్ణయించారు. రెండు నెలలు గడవక ముందే ఆ ఉత్తర్వులను గాల్లో వదిలేసింది.  టేబుల్‌ ఆజెండా కింద రాష్ట్ర వ్యాప్తంగా అయిదు మండపాలను నిర్మించడానికి పచ్చజెండా ఊపేసింది.  నిధులను కూడా మంజూరు చేసేసింది. కొత్త కళ్యాణమండపాలకు  రూ.6 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయాలను సవరించారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మరో ముగ్గురు పాలకమండలి సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిళ్తు రావడంతో  వీరి నియోజకవర్గాలలో కళ్యాణమండపాల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. కోడెల సొంత ఊరిలో కళ్యాణమండపం,  డిప్యూటీ సీఎం సొంత ఊరిలో మరొకటికి ఆమోదం తెలిపింది.  మిగిలినవి ముగ్గురి పాలకమండలి సభ్యుల సొంత ఊర్లల్లో నిర్మిస్తారు.  నిర్ణయాలను తమకు అనుకూలంగా ఎటైనా తారుమారు చేయడం పాలకమండలికి పరిపాటిగా మారింది. నిర్ణయాలు, అమలుచూసి టీటీడీ అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు.  ఏ నిర్ణయాన్ని  అమలుపరచాలో తెలియక తికమక పడుతున్నారు.
అర్థమవుతోంది.  ఏ నిర్ణయాన్నయినా తమకు అనుకూలంగా మార్చి వేయవచ్చన్నట్టుంది పాలకమండలి శైలి.

కల్యాణ మండపాల్లోనూ అదే తంతు
కల్యాణ మండపాల విషయంలో కూడా పాలకమండలి అదే తంతును కొనసాగిస్తోంది. ఆరు నెలల పాటు కొత్త కల్యాణమండపాల నిర్మాణానికి ఆమోదం తెలపకూడదని గతేడాది ఆగస్టులో పాలకమండలి నిర్ణయించింది. రెండు నెలలు గడవక ముందే ఆ ఉత్తర్వులను గాలిలో వదిలేసింది.  టేబుల్‌ ఆజెండా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండపాలను నిర్మించడానికి పచ్చజెండా ఊపేసింది.  నిధులను కూడా మంజూరు చేసింది. కొత్త కల్యాణమండపాలకు  రూ.6 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయాలను సవరించారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మరో ముగ్గురు పాలకమండలి సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో  వీరి నియోజకవర్గాల్లో కల్యాణమండపాల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. కోడెల సొంత ఊరిలో కల్యాణమండపం,  డెప్యూటీ సీఎం సొంత ఊరిలో మరొకటికి ఆమోదం తెలిపింది.  మిగిలినవి ముగ్గురి పాలకమండలి సభ్యుల సొంత ఊర్లలో నిర్మిస్తారు.  నిర్ణయాలను తమకు అనుకూలంగా ఎటైనా తారుమారు చేయడం పాలకమండలికి పరిపాటిగా మారింది. నిర్ణయాలు, అమలు చూసి టీటీడీ అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు.  ఏ నిర్ణయాన్ని  అమలుపరచాలో తెలియక తికమక పడుతున్నారు.

మరిన్ని వార్తలు