జిల్లాలో పలుచోట్ల వర్షాలు

12 Sep, 2013 02:21 IST|Sakshi

మచిలీపట్నం, న్యూస్‌లైన్ :  జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కంకిపాడులో ఉదయం 11.30 నుంచి 1.15 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వరి పొలాలతో పాటు పసుపు తోటలు, తమలపాకు, దొండతోటల్లో నీరు నిల్వ ఉండిపోయింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవటంతో పసుపు, దొండ, తమలపాకు తోటలు దెబ్బతింటాయనే భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరింత వర్షం కురిస్తే పసుపు తోటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.

విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నాం సమయంలో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. చల్లపల్లి, ఘంటసాల, మచిలీపట్నం, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. పామర్రులో మధ్యాహ్నాం 12గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. కైకలూరులో ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నా, 12గంటలకు వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది.  కేతనకొండ, దావులూరు, కొటికలపూడి, జూపూడి తదితర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పొలాల్లో భారీవర్షం కారణంగా నీరు చేరింది.  పత్తి మొగ్గలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
 
చల్లపల్లిలో అత్యధికంగా 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మోపిదేవిలో అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం బుధవారం ఉదయం 8గంటలకు 2.8 మిల్లీమీటర్లుగా నమోదైంది.  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వత్సవాయి 11.4, పెనుగంచిప్రోలు 2.2, ఇబ్రహీంపట్నం 1.0, రెడ్డిగూడెం 6.4, పెనమలూరు 1.0, చాట్రాయి 7.6, పమిడిముక్కల 4.2, మొవ్వ 4.0, మచిలీపట్నం 12.6, పామర్రు 1.6, పెడన 9.2, ముదినేపల్లి 1.2, మండవల్లి 2.0, కైకలూరు 16.4, కలిదిండి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 

మరిన్ని వార్తలు