ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు చర్యలు : డీజీపీ

2 Feb, 2014 03:42 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించేందకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. డీజీపీ తిరుపతి నుంచి రోడ్డుమార్గాన శనివారం సా యంత్రం 5.45 గంటలకు నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుం టూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, విజిలెన్స్ అధికారులు, పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసు కవాతుమైదానంలో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల తీరు, తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కాప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
 
 అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 175 కిలోమీటర్ల మేర జాతీయరహదారి విస్తరించి ఉందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయన్నారు. వాటిని నియంత్రించేందుకు హైవేపై పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికే పోలీసు సిబ్బంది విసృ్తత తనిఖీలు, దాడులు నిర్వహించి స్మగ్లర్ల భరతం పడుతున్నారన్నారు. పూర్తిస్థాయిలో స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా యూనిక్ నంబర్‌ను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రిటైర్డ్ సిబ్బందిని పర్యవేక్షణ అధికారులుగా నియమించి వారి సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.సివిల్ వివాదాల్లో తలదూర్చరాదని, అలాంటి సమస్యలు వస్తే లోక్‌అదాలత్‌కు పంపాలని అధికారులను ఆదేశించామన్నారు. వైట్‌కాలర్ నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.  పెరుగుతున్న జనాభాకు సరిపడా సిబ్బంది లేరన్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 35 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. జిల్లా తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్న సంకేతాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అందులో భాగంగానే ఇస్కపల్లి, దుగ్గరజాపట్నం, శ్రీహరికోటల్లో మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు.
 
 క్యాప్ సందర్శన
 డీజీపీ బి.ప్రసాద్‌రావు తన సతీమణి బి.సౌమిణితో కలిసి కొండాయపాళెం గేటు సమీపంలోని పోలీసు అండ్ ైచె ల్డ్ ప్రాజెక్ట్(క్యాప్)ను శనివారం రాత్రి సందర్శించారు. పోలీసు హాస్టల్‌లోని విద్యార్థులకు కంప్యూటర్లు, మంచాలు, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, నగర, రూరల్ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఎస్పీ రామకృష్ణ  పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు