మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీకి అనుమతి

26 Apr, 2020 14:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో కార్యనిర్వాహక కమిటీని, ఆరుగురు వైద్యులతో సాంకేతిక కమిటీ బృం​దాన్ని నియమించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ల్యాబొరేటరీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. (పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్)

కోవిడ్‌–19 ఓఎస్డీగా జయచంద్రా రెడ్డి
అమరావతి: కోవిడ్‌–19కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, కంట్రోల్‌ రూం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా డాక్టర్‌ పీఎల్‌.జయచంద్రా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. విధులకు తక్షణం హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. జయచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు.  (సీఎం జగన్కు అమిత్ షా ఫోన్)

మరిన్ని వార్తలు