కర్నూలులో ప్లాస్మాథెరపీ ప్రారంభం

12 Jul, 2020 05:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు చెందిన ఓ వ్యక్తికి వైద్యులు క్లినికల్‌ ట్రయల్స్‌ కింద ప్లాస్మాథెరపీ చేశారు. ఇదివరకు ఢిల్లీ, ఆ తర్వాత తిరుపతిలో మాత్రమే ప్లాస్మా థెరపీ చేశారు. నెల క్రితం ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ప్లాస్మా సేకరణకు, 2 వారాల క్రితం ప్లాస్మాథెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి వచ్చింది. శుక్రవారం రాత్రి 11:30 గంటలకు కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు