కి‘లేడీ’లు..!

10 Dec, 2013 04:08 IST|Sakshi
నెత్తిపై బుట్ట.. అందులో కొన్ని ప్లాస్టిక్ వస్తువులు..ఊరూరా..వీధివీధి సంచారం..చూడగానే..ఈఇంతులకెంత కష్టం..పొట్టకూటి కోసం ఎంత కష్టపడుతున్నారు అనుకునేంత అమాయకత్వం.. అదే వారికి పెట్టుబడిగా మారుతోంది. మహిళలను చూడగానే..జనం సహజంగా ప్రదర్శించే జాలి.. వారి మాయా ప్రవృత్తికి మార్గమవుతోంది. దొంగతనాలకు పాల్పడుతున్నారు. తీరా దొరికిపోయే సరికి..అబ్బే తమకేమీ తెలియదంటూ.. చేతులెత్తేస్తున్నారు.  నరసన్నపేటలో సోమవారం జరిగిన ఓ చోరీ ఘటన ఈ ముఠా అసలు రూపాన్ని తేటతెల్లం చేసింది.
 
 నరసన్నపేట,న్యూస్‌లైన్:  తిలారు గ్రామానికి చెందిన తంగి ధనలక్ష్మి నరసన్నపేట సంతకు వచ్చింది. సరిపడా సామగ్రి కొనుగోలు చేసి.. తన పర్సులోని కొంత సొమ్మును  వ్యాపారికి  ఇచ్చింది. మిగతా రూ.6 వేల సొమ్ముతో పాటు పర్సును సామగ్రిపై పెట్టింది. అయితే..ఆ సమయంలో నెత్తిపై ప్లాస్టిక్ వస్తువులతో కూడిన బుట్టలతో ఇద్దరు మహిళలు వచ్చారు. ధనలక్ష్మి  కాస్త  ఆదమరిచి ఉండడంతో పర్సును కొట్టేశారు.
   పర్సులో ఉన్న నగదును బాలుడు తీసేసి..పర్సును కాలువలో పడేశా డు.
 
 అయితే.. తానొకటి తలిస్తే..భగవంతుడొకని తలచు అన్న చందాన..వీరైతే..గుట్టు చప్పుడు కాకుండా..రూ.6 వేలు నొక్కేశామనుకుని సంబర పడుతున్నా.. ఈ తంతంగమంతా..నరసన్నపేటకు ఓ కలాసీ గమనిస్తున్నా డు. అంతలోనే..ధనలక్ష్మి కూడా తన పర్సు పోయిందంటూ..కేకలు వేయడంతో.. అంతా కలిసి..వారి కోసం గాలించారు. స్థానిక మఠం వీధి వద్ద  పట్టుకున్నారు. స్థానికులంతా నిలదీయడంతో తమకు కేవలం రూ.1500 దొరికాయంటూ..బాలుడి ద్వారా ఇవ్వబోయా రు.స్థానికులు గట్టిగా నిలదీసి..స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రైనీ ఎస్సై శ్రీనివాసరావు పోలీసులతో సహా వచ్చి..వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు